దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బీజేపీ హైకమాండ్ కొత్త ఇంఛార్జ్, కో ఇంఛార్జులను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. అయితే తెలంగాణకు మాత్రం తరుణ్ చుగ్ కే తిరిగి బాధ్యతలు అప్పగించింది. మునుగోడు ఉపఎన్నిక, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తరుణ్ చుగ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని అధిష్ఠానం భావించింది. ఈ మేరకు తెలంగాణ బాధ్యతలు మళ్లీ ఆయనకే కట్టబెట్టింది. కో ఇంఛార్జ్ గా అరవింద్ మేనన్ ను నియమించింది.
బిహార్‌కు వినోద్ తావ్డే, ఛత్తీస్‌గఢ్‌కు ఓం మాథూర్, హరియాణాకు బిప్లవ్ కుమార్ దేబ్, ఝార్ఖండ్‌కు లక్ష్మీకాంత్ వాజ్‌పేయీ, కేరళకు ప్రకాశ్ జావడేకర్, లక్షద్వీప్‌కు రాధామోహన్ అగర్వాల్, మధ్యప్రదేశ్‌కు మురళీధర్‌రావు, పంజాబ్, ఛండీగఢ్‌కు విజయ్ భాయ్ రూపానీ, రాజస్థాన్‌కు అరుణ్ సింగ్, త్రిపురకు మహేశ్ శర్మ, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలకు వినోద్ సోన్‌కర్, పశ్చిమ బెంగాల్ మంగళ్ పాండే, ఈశాన్య రాష్ట్రాలకు సంబిత్ పాత్ర పేర్లను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు.