రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ నేడు అత్యవసర భేటీ నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడిని పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. దీంతో నేడు జరుగబోయే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ జరుగనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వరి ధాన్యం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య చిచ్చుపెట్టింది. నిన్న బండి సంజయ్ పై నల్గొండలో జరిగిన దాడిని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహ రచన చేయనుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న దాడులను ప్రతిఘటించేలా కార్యాచరణ రూపొందించనుంది. ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా.. టీఆర్ఎస్ విమర్శలను తిప్పి కొట్టే విధంగా కార్యాచరణ రూపొందించనుంది.