తెలంగాణాలో అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం మొదలు ఎన్నికల దాకా అన్ని విషయాల్లో గట్టి పోటీ ఇస్తూ వచ్చిన బిజెపి ఇప్పటిదాకా ఒక్క సీటు కూడా గెలవక పోవడం చర్చనీయంశంగా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ చైతన్యపురి అభ్యర్థి రంగా నరసింహ గుప్తా విజయం సాధించారు. ఇక్కడ రెండో స్థానానికి టిఆర్ఎస్ పరిమితం అయింది. అయితే తాము వెనుకబడటానికి కారణం టిఆర్ఎస్ సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు.
కేవలం సోషల్ మీడియా ద్వారా బీజేపీ మీద విష ప్రచారం చేశారని ఆయన అన్నారు. పదివేల రూపాయలు వరద సహాయం విషయంలో తమ రాష్ట్ర అధ్యక్షుడు ఆపేయమని లేఖ రాశాడు అంటూ టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన అన్నారు. అలానే ఆంధ్రకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరిని తమ రాష్ట్ర అధ్యక్షుడు తిట్టినట్లుగా ఉన్న ఫేక్ ట్వీట్లను ఆ పార్టీ వాళ్ళు వైరల్ చేశారని అని ఆయన అన్నారు