మోడీకి లేఖ రాసిన హీరో కార్తి.. ఎందుకో తెలుసా..!

-

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఊహించని విధంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారీ రేంజ్లో రైతులందరూ ఉద్యమ బాట పట్టారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అంటూ నినాదాలు చేస్తూ భారీగా ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ క్రమంలోనే దిగివచ్చిన కేంద్రప్రభుత్వం రైతులతో చర్చలు జరుపుతుంది అనే విషయం తెలిసిందే. ఇక రైతులు చేపడుతున్న ఉద్యమాలకు మద్దతుగా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు మద్దతుగా కూడా నిలుస్తూ ఉండటం గమనార్హం.

అయితే ఇటీవలే రైతులు చేపడుతున్న నిరసనలకు మద్దతుగా నిలిచిన కన్నడ హీరో కార్తి ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. ఇక లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. రైతులు చేస్తున్న నిరసనలపై వెంటనే కేంద్రం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలంటూ లేఖలో కోరారు కార్తీ. ఎంతో మంది రైతులు ఉద్యమాల బాట పడుతున్నారని ప్రభుత్వం వెంటనే కర్షకుని కష్టపెట్టకుండా వారి సమస్యలపై స్పందించాలని కోరారు. ఇక రైతులు చేస్తున్న నిరసనలో వృద్ధులు మహిళలు కూడా పాల్గొంటున్నారని ఇక ఈ నిరసన చారిత్రాత్మకం కాకముందే కేంద్రం స్పందించడం మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసారు హీరో కార్తీ.

Read more RELATED
Recommended to you

Latest news