బీజేపీ సెంట్రల్ కమిటీ కీలక సమావేశం… యూపీ ఎన్నికలు, అభ్యర్థులు ఎంపికపై నిర్ణయం

-

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇప్పటికే ఎన్నికలక కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. తాజాగా ఈరోజు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాయలంలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో యూపీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొననున్నారు.

మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే యూపీ క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో జాతీయ నాయకులు యూపీ పరిణామాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news