ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండగా ఉందో లేదో తెలియదు గాని రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతల్లో ఒక వర్గం మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అన్ని విధాలుగా అండగా నిలబడుతుంది. రాజకీయంగా జగన్ అన్ని విధాలుగా అండగా ఉంటూనే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ విమర్శలు చేస్తున్నారు టీడీపీ మీద.
అందులో ప్రధానంగా చెప్పుకునేది ప్రకాశం జిల్లాకు చెందిన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎంపీ ఢిల్లీ బిజెపి కార్యదర్శి జీవిఎల్ నరసింహారావు. ఆయన మీడియా సమావేశం పెడితే మన తెలుగు మీడియా ఏదో వింతగా ఆయన వైపు చూస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇది మరింతగా ఎక్కువైందనే చెప్పవచ్చు, అమరావతి విషయంతో పాటుగా కొన్ని విషయాల్లో ఆయన పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పుడు ఇదే బిజెపికి చికాకుగా మారింది. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా నషాలానికి ఎక్కింది. జీవిఎల్ తీరుపై కొందరు పార్టీ నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఏపీలో ఆయన మాట్లాడే మాటలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని చెప్పారట. వెంటనే జెపి నడ్డా ఆయనను పిలిచి వార్నింగ్ ఇచ్చారట. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని సూచించారట నడ్డా. అమరావతి సహా కొన్ని విషయాల్లో మాట్లాడవద్దని చెప్పెసారట.