మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో వేడి పుట్టిస్తుంది. ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కీలకంగా మారనుంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి ఈ ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక కాయమనే విషయం తెలిసిందే. అయితే మునుగోడులో ఉప ఎన్నికలు పెట్టే ధైర్యం బిజెపికి లేదని అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.
మునుగోడు ఉపఎన్నికల్లో బిజెపి ఎన్ని సర్వేలు చేసినా మూడవ స్థానానికే పరిమితం అయిందని అన్నారు. అందుకే మునుగోడులో బిజెపి ఉప ఎన్నికలు పెట్టదని.. బిజెపికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఒక నియోజకవర్గాన్ని ఎదుర్కోలేని బిజెపి వాళ్లు.. రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడడం ఉట్టి కొట్టలేనమ్మ ఆకాశానికి ఎక్కినట్లు ఉందన్నారు. జై జవాన్ – జై కిసాన్ అనే పదాలకు అర్థం కూడా తెలియని గొప్ప దేశభక్తులు బిజెపి నేతలు అంటూ ఎద్దేవా చేశారు. జవాన్ల యొక్క అమరత్వ గొప్పతనం తెలియని మూర్ఖులు కాబట్టే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి.