హుజూరాబాద్ లో కురుక్షేత్రం జరుగుతోంది.- ఈటెల రాజేందర్

హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎప్ మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందని, కేసీఆర్ బానిసలు హుజూరాబాద్ ప్రజలను ఇబ్బందిపడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఎన్నిసార్లు రిపోర్ట్ తెప్పించిన 75 శాతం మంది బీజేపీ వైపు ఉన్నారని, కేవలం 25 శాతం మంది టీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలియడంతో టీఆర్ఎస్ పార్టీకి నిద్ర పట్టడం లేదని విమర్శించారు.

హుజూరాబాద్ లో డబ్బు సంచులు, మధ్యంతో ప్రజలను కొనాలని చూస్తున్నారని, కానీ హుజూరాబాద్ ప్రజలు ధర్మం వైపు ఉన్నారని తప్పకుండా బీజేపీని గెలిపిస్తారని ఆయన స్పష్టం చేశారు. మీకు దళితులపై ప్రేమ ఉంటే ఎటువంటి నిబంధనలు లేకుండా హుజూరాబాద్లోని దళితులందరికీ రూ. 10 లక్షలు ఇవ్వాలని, అలాగే 33 జిల్లాల ప్రజలకు దళితబంధు ఇవ్వాలని ఈటెల డిమాండ్ చేశారు. బతికుండగానే బొందపెట్టాలని టీఆర్ఎస్ చూస్తుందని కానీ మీ ప్రయత్నాలు ఫలించవని అన్నారు.