దక్షిణాదిపై పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆపార్టీ నేతలే చెప్పకుంటున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ, తమిళనాడుకు చెందిన తమ పార్టీ నేతలిద్దరికీ ఇటీవల కీలకమైన గవర్నర్ పదవులు కట్టబెట్టింది. అయితే తెలంగాణ, ఏపీ కంటే తమిళనాడులో పార్టీ మరీ బలహీనంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఆ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని లక్ష్యంతో బీజేపీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది.
ఈక్రమంలోనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆ పార్టీ కన్నేసింది. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత అలాంటి జనాకర్షక నేతలెవరూ అటు అన్నాడీఎంకేకు కానీ.. ఇటు డీఎంకేకు కానీ లేరు. అయితే జయలలిత స్థాయిలో రజనీకాంత్ కూడా ప్రభావితం చేస్తారని బీజేపీ బలంగా నమ్ముతోంది. వాస్తవానికి సి నిమాల్లో రజనీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. కోట్లాది మంది అభిమానుల్లో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న రజనీని పార్టీలో చేర్చుకుని, కీలక బాధ్యతలు అప్పగిస్తే.. రాష్ట్రంలో ఇక తిరుగు ఉందడదని అదిష్టానం అంచనా వేస్తోంది.
తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అప్పగిస్తారని రాష్ట్రంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన తమిళిసైని తప్పించి, ఆమెకు గవర్నర్ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజకీయ పార్టీ పెడతా అని ఊరిస్తూ వస్తున్నర జనీకాంత్‌కు మోడీ, అమిత్ షాల నుంచి బంపర్ ఆఫర్లు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే చాలా కా లంగా… రజనీకాంత్‌తో వారు చర్చలు జరుపుతున్నారని… అందుకే.. ఇటీవలి కాలంలో… రజనీకాంత్ మోడీ, షాలపై అనూహ్యంగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
తమిళనాడులో బీజేపీకి పట్టు చిక్కడం లేదు. అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఓ మాదిరిగా కూడా.. బ లం పుంజుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే.. రజనీకాంత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతను చేర్చుకోవాలనే ప్రయత్నాలు చాలా కాలంగా సాగుతున్నాయి.మరోవైపు రజనీకాంత్ కూడా చాలా కాలంగా బీజేపీపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్జీఆర్ పాలన తెస్తానని ప్రకటించారు. ఈక్రమంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి రజనీని పార్టీలో చేర్చుకుని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే మరి రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.