గుజరాత్‌లో 7సారి అధికారం..బెంగాల్‌లో సీపీఎం రికార్డును సమం చేసిన BJP

-

గుజరాత్‌లో బీజేపీ రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే, పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం రికార్డును సమం చేసింది బీజేపీ. ఇక ఈ విజయంతో గుజరాత్‌లో వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ.

గుజరాత్‌లో 1995లో 121 స్థానాలు గెలిచిన బీజేపీ, 1998లో 117 స్థానాల్లో విజయం సాధించింది. 2002లో 127 సీట్లు కైవసం చేసుకుంది.

2007లో 117 స్థానాల్లో గెలుపొందింది బీజేపీ పార్టీ. 2012లో 115 స్థానాలు గెలుచుకుంది. కానీ 2017లో 99కి పరిమితం అయింది భారతీయ జనతా పార్టీ. కానీ.. ప్రస్తుతం 150కి పైగా స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతోంది బీజేపీ పార్టీ. దీంతో బీజేపీ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news