మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్న కేసులో బుధవారం బెర్నార్డ్ ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. బెర్నార్డ్ తన ఫామ్ హౌస్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసిన బెర్నార్డ్ ను తీసుకురావడానికి తమ బృందం వెళ్లినట్లు వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ వివేకానంద సింగ్ పేర్కొన్నారు.
వ్యభిచార గృహంలో ఆరుగురు చిన్నారులను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు మైనర్ అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా 73 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గారోహిల్స్ జిల్లాలో ఉన్న బెర్నార్డ్ మరక్‌కు చెందిన రింపు బగన్ అనే ఫామ్ హౌస్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు.