వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయప్రద

-

ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చేస్తున్నారని మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం
చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు పార్టీ
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.

With Sexist Remark Against Jaya Prada, Samajwadi Leader Firoz Khan Steps On  Landmine

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పనిచేయలేదు. ఏపీలో రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారు… కానీ పేదలకు ఒరిగిందేమీ లేదు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలేదు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి
దయనీయంగా ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. బీజేపీ గర్జనకు మద్దతిచ్చిన
మీ అందరికీ ధన్యవాదాలు. భాజపాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది” పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భాజపా నేతలు జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురందేశ్వరి, మాధవ్ తదితరులు
పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news