నేచురల్ స్టార్ నాని..చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారో అఫీషియల్ గా ప్రకటించేసింది చిత్ర బృందం. ఈ నెల 9న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతున్నారని స్పష్టం చేసింది. దాంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సుందర్ ప్రసాద్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తుండటం సంతోష కరమని, తాను, తన టీమ్ థ్రిల్ గా ఫీలవుతున్నామని నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, పాటలు ఆకట్టుకుంటున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపైన బజ్ ఒక్కసారిగా బాగా పెరిగింది. గతంలో ఏపీ సినిమా టికెట్ల విషయమై నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తొలిసారి వీరిరువురు ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజీ పంచుకోవడమేనది ఆసక్తికరంగా మారింది.
Pawan kalyan for Sundar prasad ♥️
Thank you sir @PawanKalyan .#AnteSundaraniki team and I are thrilled 🙏🏼
Looking forward to the pre release event on 9th :))— Nani (@NameisNani) June 7, 2022
Ante…mana event ki @PawanKalyan garu vastunnaru 🤩🤩#PKforSundar ❤️#AnteSundaraniki pre release event on June 9th from 6 PM onwards 💥💥
IN CINEMAS JUNE 10 💥@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/xw2xsotzjD
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2022