తెలంగాణ సర్కార్‌పై భాజపా నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల అనుమతి.. ఈ నెల 22న భాజపా కార్యకర్తలపై దాడి ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు. బండి సంజయ్ పాదయాత్రపై దాడిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాత్రపై విచారణ జరపాలని గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. లక్ష్మణ్‌తోపాటు డీకే అరుణ, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి, రాంచందర్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గవర్నర్‌ను కలిశారు.
ప్రజలకు భరోసా కల్పించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు పాదయాత్రపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భాజపా నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు.