డైరీ మిల్క్ చాక్లెట్ కంపెనీపై బీజెపి నేతలు ఫైర్.. కారణం ఇదే?

-

పండుగలు వస్తే క్యాడ్బరీ కంపెనీ కొత్త కొత్త యాడ్ లను చేస్తూ సేల్ ను పెంచుకుంటూ వస్తుందన్న విషయం తెలిసిందే..క్యాడ్‌బరీలను సెలబ్రేషన్ బాక్స్ గా గిఫ్ట్స్ గా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే కంపెనీకి చెందిన కొన్ని విషయాలు ప్రస్తుతం వినియోగదారులకు నచ్చలేదు. దీంతో చాలామంది చాకెట్ల ప్రేమికులు ఏకంగా క్యాడ్‌బరీలను బహిష్కరణ చేయమని డిమాండ్‌ చేస్తూ తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్‌లోకి వచ్చింది. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చాలామంది నెటిజన్లు #BoycottCadbury అంటూ డిమాండ్ చేస్తున్నారు.

అసలు విషయానికొస్తే..ఈ విధంగా ప్రజలలో విమర్శలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారికాదు. అయితే ఈసారి సమస్య కొంచెం భిన్నంగా ఉంది ఎందుకంటే ఈసారి క్యాడ్‌బరీ చాకెట్లు వాటి ఉత్పత్తి కారణంగా విమర్శలకు గురికావడం లేదు.. దాని ప్రకటన కారణంగా విమర్శలను ఎదుర్కొంటుంది. వాస్తవానికి, దీపావళి రోజున చాకెట్ల అమ్మకాలను పెంచడానికి ఒక యాడ్ ను రిలీజ్ చేశాడు. ఈ యాడ్ లో దీపం అమ్ముతున్న వృద్ధుడిని చూడవచ్చు. అతని పేరు దామోదర్.. అయితే ప్రధాని మోడీ తండ్రి పేరు కూడా దామోదర్. ఈ యాడ్ విమర్శలకు గురి కావడానికి మరియు #BoycottCadbury ట్విట్టర్‌లో ట్రెండ్ కావడానికి ఇదే కారణం..

బీజేపీ నాయకురాలు డాక్టర్ ప్రాచీ సాధ్వి ఈ తరహా ప్రకటనల ద్వారా ప్రధాని మోదీ తండ్రి పేరును కించపరుస్తున్నారని.. ప్రజల్లో చాయ్‌వాలా కా బాప్ దియావాలా అనే సందేశం ఇస్తున్నారని ట్వీట్ చేశారు. జేపీ#ఎపీ నేత చేసిన ఈ ట్వీట్ తర్వాత ఈ విషయం వైరల్‌గా మారింది..ఇదొక్కటే కాదు..క్యాడ్‌బరీ తన ఉత్పత్తులలో హలాల్ సర్టిఫైడ్ జెలటిన్‌ను ఉపయోగిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇందులో వాడే జిలెటిన్‌ను గొడ్డు మాంసం నుంచి సేకరిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news