బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్ట్. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. స్పీకర్ వాళ్ల అభ్యర్థను వినేలా ఆదేశించింది హైకోర్ట్. సస్పెన్షన్ వ్యవహారంలో స్పీకర్ దే తుది నిర్ణయం అని హైకోర్ట్ వెల్లడించింది. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకరే కీలకం అని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. అసెంబ్లీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని.. కానీ కొన్నింటి అంశాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించింది. సభ్యుల హక్కుల విషయంలో జోక్యం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుతోనే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే సభా నియమాలను ఉల్లంఘించలేదని పిటిషనర్ల తరుపు న్యాయవాది వాదించారు. సభా నియమాలను ఉల్లంఘించినట్లు ఆధారాలు లేవని ఆయన అన్నారు. సభాపతి.. ఎమ్మెల్యేల వాదనలు వినేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సభలో సభ్యుల హక్కులను కాపాడే విధంగా స్పీకర్ వ్యవహరిస్తారని హైకోర్ట్ ఆశాభావం వ్యక్తం చేసింది. సభలో సభ్యులు ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని వ్యాఖ్యానించింది హైకోర్ట్.
బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలవండి…. సస్పెన్షన్ విషయంలో స్పీకర్ దే తుదినిర్ణయం: హైకోర్ట్
-