ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కోట్లాది జంతువులను దహించి వేసింది. కోట్ల కొద్దీ అడవి జంతువులు గాయపడ్డాయి. విలువైన జంతు సంపద మంటల్లో మాడి మసైపోయాయి. ప్రాణాలను కాపాడుకోలేని జీవులు అలాగే మంటల్లో ఉండిపోయాయి. మనం అంటే మనుషులం, కాపాడమని అరుస్తాం. మరి వాటిని ఎవరు కాపాడతారు…? కాపాడితే మనం లేకపోతే ఆ మంటల్లో అవి దహనం అయిపోవడమే.
కోట్లాది అడవి జంతువులు హాహాకారాలతో తమ వారిని పోగొట్టుకున్నాయి. పెద్ద జంతువులు తమ బిడ్డలను, బిడ్డలు తమ తల్లులను పోగొట్టుకుని రోదిస్తున్నాయి. ఈ తరుణంలో ఒక నక్క తన తల్లి తనాన్ని చాటుకుంది. ఆస్ట్రేలియాలోని కంగారూ ఐలాండ్‌లో మంటల ధాటికి ఎన్నో అడవి జంతువుల పిల్లలు తల్లులను పోగొట్టుకున్నాయి. ముఖ్యంగా కోలా ఎలుగు బంట్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.
ఈ తరుణంలో ఒక నక్క కోలా ఎలుగుబంటి పిల్లలకు ఏ మాత్రం జాతి భేదం లేకుండా పాలు ఇచ్చి పిల్లలను కాపాడింది. ఆకలితో ఉన్న ఆ పిల్లలకు నక్క పాలు ఇస్తున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దీనితో ఇప్పుడు ఆ నక్కకు ప్రపంచం సలాం అంటుంది. అమ్మ లక్షణం జంతువుకి మనుషులకు ఒకరకంగా ఉండదు అని, అమ్మకు ఆకలి తెలుసు అని, ఆ నక్క ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చిందని అంటున్నారు.
https://twitter.com/adarshhgd/status/1220931047782666240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1220931047782666240&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fadarshhgd%2Fstatus%2F1220931047782666240