బెంగాల్ లో సీన్ రివర్స్ : బిజేపి నుంచి టీఎంసీలోకి నేతల క్యూ

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మంచి విజయం సాధించారు. ఆమె విజయం దెబ్బకు బిజెపి నేతలు బెంగాల్ లో ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసిన పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. మమతా బెనర్జీ మినహా 200 పైగా అసెంబ్లీ స్థానాలను అవలీలగా గెలిచింది టీఎంసీ. అయితే ఆ ఎన్నికల ముందు.. టీఎంసీకి చెందిన సుబేందు అధికారి లాంటి కీలక నేతలను లాగేసుకున్న బీజేపీ.. మమతా బెనర్జీని ఒంటరి చేసింది. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఒంటిచేత్తో తన పార్టీని విజయ తీరాలకు చేర్చింది మమతాబెనర్జీ. అయితే ఆమె విజయం తర్వాత బెంగాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్ళిన నాయకులు అంతా ఇప్పుడు టీఎంసీ బాట పడుతున్నారు.

ఇప్పటికే పలుగురు నాయకులు బిజేపికి షాక్ ఇవ్వగా.. తాజాగా మరో షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ మళ్లీ టిఎంసి గూటికి చేరారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ముకుల్ రాయ్ ఆర్బాటంగా బిజెపిలో చేరారు. అయితే తాజాగా మనసు మార్చుకున్న ముకుల్ రాయి.. బీజేపీ నుంచి టిఎంసిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ముకుల్ రాయ్ మళ్ళీ టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా చాలా మంది నాయకులు బిజేపి నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.