అంటువ్యాధిలా పెరగనున్న డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ.. నిపుణుల హెచ్చరిక.

డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ.. సెలెబ్రిటీలు, ప్రైవేటు వ్యక్తుల ఫోటోలని మార్ఫింగ్ చేసి పోర్నోగ్రఫీ సెట్లలో అందుబాటులో ఉంచడం. ఇతరుల వ్యక్తిగత స్వేఛ్ఛని హరిస్తూ, అనుమతి లేకుండా మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురి చేయడం. ప్రొఫెసర్ మెక్ గ్లారీ ప్రకారం ఈ నేరాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని, మార్ఫింగ్ చేసిన అసభ్య ఫోటోలు, వీడియోలతో మహిళలపై అక్రమాలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయని తెలిపింది.

స్కాట్లాండుకి చెందిన బీబీసీ ప్రతినిధులు ఈ విషయమై విచారణ ప్రారంభించారు.

వారి విచారణలో కనుక్కున్న ప్రకారం, మూవింగ్ ఇమేజెస్ సాయంతో ఫేక్ పోర్నోగ్రఫీ సృష్టిస్తున్నారని, దానికి కావాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ ఇంట్లో ఉన్న కంప్యూటర్లోనే అందుబాటులో ఉన్నాయని, ఈ కారణంగా ఏటా ఎంతో మంది మహిళలు ఇబ్బందికి గురవుతున్నారని పేర్కొన్నారు. 2019నుండి ఇప్పటి వరకు ఏటా ముడు రెట్ల కేసులు పెరుగుతున్నాయని వెల్లడి చేసారు.

డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ విచారణలో నిపుణులైన హెన్రీ అజ్డెర్ ప్రకారం, 2017నుండి డీఫ్ ఫేక్ పోర్నోగ్రఫీ పట్ల క్రేజ్ పెరిగిందని అన్నారు. ఇంగ్లాండులోని హెలెన్ మార్ట్ అనే రచయిత మార్ఫింగ్ ఫోటోలు పోర్న్ సైటులో రెండేళ్ళ నుండి ఉన్నాయి. అది తెలుసుకున్న రచయిత పోలీసులకి కంప్లైంట్ చేయాలని అనుకుంది. కానీ ఇంగ్లాండులో ఫోటో మార్ఫింగ్ విషయంలో పెద్దగా కేసులు లేవు. అదీగాక అలాంటి ఇమేజెస్ తీసివేయాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాలేదని చెప్పింది.

దుర్హామ్ యూనివర్సిటీకి చెందిన మెక్ గ్లిమ్ మాటల ప్రకారం యూకే, స్కాట్లాండ్ దేశాల్లో ఇలాంటి డీప్ ఫేక్ పోర్నోగ్రఫీపై పోరాటం గట్టిగా సాగుతుంది. ఇతర దేశాల్లోనీ ఇలాంటి అసభ్యకర పనులు చేసే వాళ్ళకు శిక్షలు విధించాలని లేదంటే ఇదో అంటువ్యాధిలా వ్యాపింది ప్రపంచం మొత్తం చుట్టుకుంటుందని అన్నారు.