సీఎం‌ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరా…!

సీఎం‌ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరా తీస్తున్నారు. ఢిల్లీ బీజేపీ నేతలకు ఫోన్లు చేసి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వివరాలను కమలనాథులు తెలుసుకుంటున్న‌ట్టు సమాచారం. కేసీఆర్ ఢిల్లీ పర్యటనను బీజేపీ లైట్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. గత ఢిల్లీ పర్యటన సందర్భంగా కొంత ఇబ్బంది పడ్డామని కాషాయపార్టీ నేతలు చెబ‌తున్నారు. హుజురాబాద్ ఫలితం తర్వాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నేత‌లు విశ్లేషిస్తున్నారు.kcr

సొంత పనుల‌ మీదనే కేసీఆర్ కుటుంబం ఢిల్లీ వెళ్ళిదని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కు హెల్త్ హబ్ గా పేరుందని… చికిత్స కోసం ఢిల్లీ దాకా ఎందుకని కమలనాథులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్రియాంక గాంధీ కుటుంబం సైతం హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వస్తోన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా కేసీఆర్ అప్ప‌ట్లో ఢిల్లీ వెళ్లి బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో గల్లీలో కుస్తీ ఢిల్లీ దోస్తీ అంటూ కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ నేత‌లు జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు.