కమలం-కాంగ్రెస్ పోటాపోటి…లిస్ట్ రెడీ?

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి..దాదాపు ముందస్తుకు అన్నీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి…మొదట అధికార టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్-బీజేపీలు ముందస్తు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో అంటే కేసీఆర్ సడన్ గా ప్రభుత్వాన్ని రద్దు చేసి…ప్రతిపక్షాలని దెబ్బకొట్టి మళ్ళీ గెలిచారు. కానీ ఈ సారి కేసీఆర్ కు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కేసీఆర్ కంటే ముందుగానే ఎన్నికల విషయంలో అలెర్ట్ గా ఉన్నాయి…అటు బీజేపీ గాని, ఇటు కాంగ్రెస్ గాని ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇక విపక్షాలు ముందస్తుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సైతం…ముందస్తుకు సై అన్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సారి టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయి. ఇప్పటినుంచే నియోజకవర్గ స్థాయిలో బలపడి…బలమైన అభ్యర్ధులని నిలపాలని చూస్తున్నాయి.

గత ఎన్నికల్లో అంటే చివరి వరకు అభ్యర్ధులు తేలలేదు…పైగా నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది..దీంతో ప్రతిపక్షాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సారి మాత్రం ఆ మిస్టేక్ చేయకూడదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుకుంటున్నాయి. అందుకే ముందుగానే అసెంబ్లీ స్థానాల అభ్యర్ధుల లిస్టుని రెడీ చేసుకోవాలని చూస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ఎలాగో సిట్టింగులు ఎక్కువ…కాబట్టి ఆ పార్టీలో చిన్న చిన్న మార్పులు తప్ప…అభ్యర్ధుల విషయంలో పెద్ద మార్పులు ఉండవు. ఇంకా మపృ ఉండాల్సింది..కాంగ్రెస్, బీజేపీల్లోనే.

ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్ధులని ముందుగానే ఫిక్స్ చేయడానికి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఇప్పటికే పలు స్థానాలని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది…అధికారికంగా బయటకు చెప్పలేదు గాని..కాంగ్రెస్, బీజేపీలు పలు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి పోటీగా అభ్యర్ధులని సెట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ లు సైతం ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news