కమలం కొత్త ఎత్తు.. కలిసొస్తుందా?

-

ఓ వైపు తెలగాణలో బీజేపీ దూసుకెళుతుంది…నెక్స్ట్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది…కానీ ఏపీలో బీజేపీ పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది..ఇక్కడ ఒక సీటు గెలుచుకుంటే గొప్ప అనే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి టీడీపీ సపోర్ట్ ఉండటం వల్ల ఇప్పటివరకు కొన్ని సీట్లు నెగ్గుకుంటూ వచ్చింది. కానీ గత ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం మొదలైంది…బలంగా ఉండే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వీక్ అవ్వడం బీజేపీకి కలిసొచ్చింది. దీని ద్వారా టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ వచ్చింది.

కానీ ఏపీలో అలాంటి పరిస్తితి లేదు. అధికార వైసీపీ బలంగా ఉంది…అలాగే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ సైతం బలపడుతుంది. అటు పవన్ కల్యాణ్ జనసేన సైతం పికప్ అవుతుంది. అంటే వైసీపీ-టీడీపీలు బలంగా ఉండగా, జనసేనకు కాస్త బలం ఉంది. ఈ మూడు పార్టీల మధ్య బీజేపీ ఏ మాత్రం పుంజుకోలేకపోతుంది. పైగా ఏపీకి విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమవుతుంది. అందుకే ఏపీ ప్రజలు ఇంకా బీజేపీపై ఆగ్రహంగానే ఉన్నారు.

అయితే జనసేనతో పొత్తులో ఉన్న బీజీపే ఏదో రకంగా బలపడాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది…కానీ బీజేపీ బలపడటం లేదు. కనీసం ఒక్క సీటు గెలుచుకునే బలం కూడా బీజేపీకి రాలేదని చెప్పొచ్చు. ఒక్క సీటు సంగతి పక్కన పెడితే..కనీసం ఒక్క శాతం ఓట్లు అయిన తెచ్చుకుంటుందా? అంటే అదే డౌటే అన్నట్లు ఉంది. ఇలా రాజకీయ కష్టాలు ఎదురుకుంటున్న బీజేపీ..ఇప్పుడు సరికొత్త ఎత్తుతో ముందుకొస్తుంది. అమరావతి ప్రజల మద్ధతు పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటించాక అమరావతి ప్రజలు పోరాటం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే జగన్..విశాఖ నుంచి పాలన మొదలుపెడతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ…అమరావతి పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర చేయడానికి సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి రాజ‌ధాని గ్రామాల మీదుగా ఈ యాత్ర 75 కిలో మీట‌ర్ల మేర బీజేపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. ఒకే రాజధాని…అమరావతి అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లనుంది. దీని వల్ల కనీసం అమరావతి ప్రాంతాల్లోనైనా రాజకీయంగా బెనిఫిట్ పొందవచ్చని బీజేపీ చూస్తుంది. మరి అమరావతి నినాదం బీజేపీకి ఏ మేర కలిసొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news