రాష్ట్రంలో బిజెపి మత కల్లోలాలు సృష్టించాలని చూస్తుంది – మంత్రి మల్లారెడ్డి

-

రాష్ట్రంలో బిజెపి మత కల్లోలాలు సృష్టించాలని చూస్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని నాగారం మున్సిపాలిటీ లో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపి మతకల్లోలాలు సృష్టించాలని చూస్తుందన్నారు. నిన్న మొన్న హిందూ ,ముస్లిం గొడవలు పెడుతున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారని చూస్తున్నారని మండిపడ్డారు.

ఖబర్దార్ రాజాసింగ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. బిజెపికి ఉన్నయే మూడు సీట్లు అని.. ఎన్నికలు వస్తున్నాయి అని ఏదో గొడవలు చేయాలి, ఏదో పంచాయతీలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. బిజెపి తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తుందన్నారు మల్లారెడ్డి. తెలంగాణ ప్రజలు బిజెపికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని నడిపించడం లేదు.. ఒక కంపెనీని నడిపిస్తోంది అన్నారు. మునుగోడులో బిజెపికి డిపాజిట్ కూడా రాదని అన్నారు మల్లారెడ్డి. టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news