సరికొత్తగా ‘అవతార్’ వచ్చేస్తోంది.. అప్‌డేట్ ఇచ్చేసిన జేమ్స్ కామెరాన్

-

జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో అద్భుతమైన సినిమా ‘అవతార్’ చూసి ప్రపంచం ఫిదా అయిపోయింది. ‘అవతార్’ లాంటి నెక్స్ట్ ఫిల్మ్ ఆయన నుంచి ఎప్పుడు వస్తుందా? అని సినీ లవర్స్ ఎదురు చూస్తున్న క్రమంలో దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చేశారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ గురించి ట్వీట్ చేశారు. 2009లో వచ్చిన ‘అవతార్’ గురించి ఇప్పటికీ సినీ లవర్స్ చర్చించుకుంటారు. హాలీవుడ్ స్టాండర్స్డ్ పెంచిన చిత్రాలను జేమ్స్ తీశారని సినీ పరిశీలకులు అంటుంటారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘అవతార్’ నెక్స్ట్ ఫిల్మ్ వస్తున్న క్రమంలో పాత అవతార్ ను సరికొత్తగా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. వచ్చే నెల (సెప్టెంబర్) 23 నుంచి ‘అవతార్’ 4 కే హై డైనమిక్ రేంజ్ వర్షన్ ను మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘అవతార్’ చిత్ర నూతన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సదరు పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటం విశేషం.

కరోనా మహమ్మారి వలన ‘అవతార్ : ద వే ఆఫ్ వాటర్’, ‘అవతార్ 3’ ల షూట్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘అవతార్’ సినీ ప్రియుల కోసం మళ్లీ ‘అవతార్’ పిక్చర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు, సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news