కారుకు సూపర్ కౌంటర్ రెడీ చేసిన కమలం..!

-

ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై పోరాటం చేసి..కారు పార్టీని చిక్కులో పడేసింది…ధాన్యం కొనుగోలు, నిరుద్యోగుల సమస్యలు, జీవో 317కు వ్యతిరేకంగా పొరాడి…బీజేపీ, కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. అలాగే ఇతర సమస్యలపై కూడా బీజేపీ దూకుడుగా వెళుతుంది.
అయితే బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్‌కు రాజకీయంగా ఛాన్స్ దొరకలేదు…కానీ అనూహ్యంగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తే బీజేపీ తగ్గుతుందని కేసీఆర్‌కు అర్ధమైంది..అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి…రాష్ట్రంలో ఉన్న బీజేపీని కట్టడి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. అసలు కేంద్రం, రాష్ట్రానికి ఏ సాయం చేయడం లేదనే అంశాన్ని హైలైట్ చేయడానికి చూస్తున్నారు…కేంద్రం అన్యాయం చేస్తుందని చెప్పుకుంటూ వస్తున్నారు.

తాజాగా మోదీ పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలని కూడా రాజకీయంగా వాడుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ సెంటిమెంట్‌ని మళ్ళీ రగిల్చి లబ్ది పొందడానికి ఎత్తుగడ వేశారు. ఇకపై కేసీఆర్ సైతం నిత్యం ప్రజల్లోనే ఉంటూ, మోదీని బూచిగా చూపించి, రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. అయితే ఇలా చేయడంలో కేసీఆర్ కొంతవరకు సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే కేసీఆర్‌ని కట్టడి చేయడానికి బీజేపీ మరికొన్ని కొత్త ఎత్తులతో ముందుకొచ్చి టీఆర్ఎస్‌కు గట్టి కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లనుందని తెలుస్తోంది. ఎలాగైనా కారుకు బ్రేకులు వేయాలని చూస్తుంది. ఈ క్రమంలోనే మరింత  ఎక్కువగా తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీజేపీ చూస్తుంది..అదే సమయంలో టీఆర్ఎస్‌లో బలమైన నాయకులని బీజేపీలోకి లాగేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే కొంతమంది నేతలని టార్గెట్ చేసుకుని బీజేపీ పావులు కదుపుతుందని తెలుస్తోంది…ముందుగా కింది స్థాయిలో ఉండే సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్‌ల్ని టార్గెట్ చేసి, వారిని పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్ ఆ దిశగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి కారుకు కమలం గట్టి కౌంటర్ ఇస్తుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news