కేడిదొడ్డి మండలం చింతలకుంటలో ప్రజా గోస – బిజెపి భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. గట్టు ఎత్తిపోతల పథకం టిఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో నేటికీ పూర్తి కాలేదని అన్నారు. రైతు బంధు పథకం వల్ల చిన్న కారు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు డీకే అరుణ.
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు వచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసిఆర్ ప్రభుత్వం తన కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. రాబోయే కాలంలో బిజెపి అధికారంలోకి వస్తుందని.. అప్పుడు అన్ని వర్గాల అభ్యున్నతికి బిజెపి కంకణ బద్దంగా పనిచేస్తుందన్నారు.