మతం పేరిట చిచ్చు రగిలిస్తూ బిజెపి దేశాన్ని సర్వనాశనం చేస్తుంది – మంత్రి ఎర్రబెల్లి

-

జనగామ జిల్లా యశ్వంతపూర్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా ఎగరవేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం అభివృద్ధి చేశాడని పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం హామీల్లో వరంగల్ కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి ఎర్రబెల్లి.

బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.. కానీ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి విషయంలో ప్రజలనడిగి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్ ఏం చేశాడనే దానిపై ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలు వివరించాలి..లేకుంటే అడ్డుపడతామన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ బీజేపీ నెరవేర్చలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి. గాంధీ లాంటి మహాత్ములు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకొస్తే బిజెపి ఆ మహనీయుల పేరు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు.

మతం పేరిట చిచ్చు రగిలిస్తూ బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు మంత్రి. రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాల కోసం కేంద్రానికి నివేదికలు పంపిస్తే మొండి చేయి చూపించింది ..బిజెపి ప్రతినిధులు ఉన్న కరీంనగర్, నిజాంబాద్ లో కూడా మెడికల్ కళాశాల తెచ్చుకోలేని దద్దమ్మలంటూ విమర్శించారు. గుజరాత్ ,మహారాష్ట్ర బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే పెద్దపేట వేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news