తెలంగాణ బంద్ ను ఉపసంహరించుకున్న బీజేపీ !

-

ఈ నెల 10 వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్‌ కు భారతీయ జనతా పార్టీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేసింది. ఈ నెల 10 వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంద్‌ ను విరిమించుకుంటున్నట్లు బీజేపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. అంతేకాదు.. ఈ నెల 8 వ తేదీ నుంచే… పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు.. బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ అధికారికంగా ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో… ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. జీవో 317 ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ… ఈ నెల 10 వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్‌ కు భారతీయ జనతా పార్టీ పిలుపు ఇచ్చింది. అటు ఈ జీవో ను రద్దు చేయాలనే ముఖ్య డిమాండ్‌ తో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌… జాగరణ దీక్ష తలపెట్టారు. అయితే.. ఆ దీక్ష ను భగ్నం చేసి.. బండి సంజయ్‌ ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news