లాయర్‌పై దాడికి దిగిన బీజేపీ యూత్ లీడర్.. ఎందుకంటే?

-

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ యూత్ లీడర్ వీరంగం సృష్టించాడు. ఓ లాయర్‌పై విక్షణారహితంగా దాడి చేశాడు. కోల్‌కతాలోని ఐసీసీఆర్ స్టేడియంలో బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉత్తర కోల్‌కతాకు చెందిన బీజేపీ యూత్ వింగ్ లీడర్ అభిజిత్ హాజరయ్యాడు. అయితే ఈ మీటింగ్‌లో సమిక్ భట్టాచార్య అనే బీజేపీ నేతను కలవడానికి సబ్యసాచి రాయ్ చౌదరి సమావేశానికి వచ్చాడు.

బీజేపీ నేత-దాడి
బీజేపీ నేత-దాడి

సబ్యసాచిని చూసిన అభిజిత్ అతడిపై దాడికి దిగాడు. అతడిని పట్టుకుని కొట్టడం ప్రారంభించాడు. సబ్యసాచి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడని, ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఆరోపించాడు. తన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడని పేర్కొన్నాడు. అయితే తాను టీఎంసీ లీడర్ కాదని, ఓ లాయర్‌నని సబ్యసాచి అన్నారు. బీజేపీ నేత సమిక్ భట్టాచార్యను కలవడానికి వచ్చానన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news