యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

-

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. జిల్లాలోని బెగ్‌రాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతులు తమ ఉత్పత్తులను సమీప అంగట్లలో అమ్ముకుని సొంతూరుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో గర్రా నదిపై నుంచి వెళ్తుండగా అదుపుత్పిన ట్రాక్టర్‌ బ్రిడ్జిపైనుంచి నదిలోపడిపోయింది. దీంతో ట్రాక్టర్‌ ఇంజిన్‌, ట్రాలి రెండు విడిపోయాయి. అయితే.. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు.

యూపీలో ఘోర ప్రమాదం.. నదిలోపడిన ట్రాక్టర్‌.. ట్రాలీలో 24 మంది

అయితే.. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారని, మరో ఐదుగురు గల్లంతయ్యారని జిల్లా మేజిస్ట్రేట్‌ అవినాశ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు 14 మందిని కాపాడామని చెప్పారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 24 మంది ఉన్నారని వెల్లడించారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. ట్రాక్టర్‌ ఇంజిన్‌, ట్రాలీని నదిలోనుంచి వెలికితీశామని చెప్పారు పోలీసులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news