ఎడిట్ నోట్: కుప్పం కుస్తీ…!

-

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతున్న విషయం ఏదైనా ఉందంటే…అది కుప్పంలో జరిగిన రచ్చ గురించే…అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణులు కొట్టుకునేవరకు వెళ్లిపోయింది. అసలు ప్రశాంతంగా ఉండే కుప్పంలో ఈ పరిస్తితి ఎందుకు వచ్చింది…ఎప్పుడు పెద్దగా మీడియాలో హైలైట్ కాని కుప్పం ఇప్పుడు ఎందుకు హైలైట్ అవుతుంది…అసలు అక్కడ రచ్చకు కారణం ఏంటి? అనేది ఒకసారి పరిశీలిస్తే…రాష్ట్రానికి దూరంగా ఉండే కుప్పంలో గతంలో ఇలాంటి గొడవలు జరగలేదు.

అది చంద్రబాబు కంచుకోట అని మాత్రం అందరికీ తెలుసు…1989 నుంచి అక్కడ గెలుస్తూ వస్తున్నారు. వరుసగా ఏడు సార్లు గెలిచారు. అయితే ఎప్పుడన్నా అభివృద్ధి కార్యక్రమాల గురించి మీడియాలో వార్తలు వచ్చేవి తప్ప…ఇలా గొడవలు జరుగుతున్నట్లు వార్తలు రాలేదు. ఆఖరికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా కుప్పంలో ఇలాంటి ఘటనలు లేవు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో యుద్ధం మొదలైంది.

కుప్పంని కూడా సొంతం చేసుకోవాలనే దిశగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరక్షన్‌లో అక్కడ వైసీపీ పనిచేస్తూ ముందుకెళుతుంది. ఇక అధికారంలో ఉండటంతో పంచాయితీ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు..పరిషత్ ఎన్నికల్లో అదే పరిస్తితి. ఇక కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలిచేస్తామని, ఇంకా బాబు కుప్పం వదిలి పారిపోవాలని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.

ఏదేమైనా గాని వైసీపీ గెలుపు వల్ల బాబుకు భయం పెరిగింది…కుప్పంని ఎక్కడా కోల్పోవాల్సి వస్తుందని చెప్పి…మూడు నెలకొకసారి కుప్పంకు వెళుతున్నారు. తాజాగా కూడా కుప్పం వెళ్లారు…ఒక ప్రతిపక్ష నాయకుడుగా, కుప్పం ఎమ్మెల్యేగా అక్కడ పర్యటించే హక్కు…బాబుకు ఉంది. కానీ కుప్పంలో బాబుకు బ్రేకులు వేయాలని చూస్తున్న వైసీపీ…తాజాగా బాబు పర్యటనకు ధీటుగా వైసీపీ బ్యానర్లు కట్టారు.

బాబు ముందు జై జగన్ అంటూ నినాదాలు చేశారు…అయితే ఒక పార్టీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరో పార్టీ వారు అలా చేయడం కారెక్ట కాదనే వాదన ఉంది. ఉదాహరణకు జగన్ సభ జరుగుతున్నప్పుడు అక్కడ టీడీపీ శ్రేణులు వెళ్ళి జై బాబు అంటే పరిస్తితి ఎలా ఉంటుంది. ఇలాంటి రాజకీయానికి విలువ ఉండదు…కుప్పంలో వైసీపీ శ్రేణులు…టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టేలా ముందుకెళ్లినట్లు తెలిసింది. వారు టీడీపీ ఫ్లెక్సీలు చింపేశారు.

ఆ తర్వాత టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి…వైసీపీ ఫ్లెక్సీలు చింపేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య రాళ్ళ దాడి జరిగింది. ఇక రెండో రోజు బాబు పర్యటనని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి వైసీపీ శ్రేణులు మరీ దూకుడుగా ముందుకొచ్చాయి. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటిన్ సైతం ధ్వంసం చేశారు. కానీ ఇంత చేస్తున్న సరే పోలీసులు, వైసీపీ శ్రేణులని నిలువరించలేకపోవడం విచిత్రం.

ఇక వైసీపీ దాడికి ధీటుగా టీడీపీ శ్రేణులు కూడా దాడులకు దిగాయి…అడ్డువచ్చిన వైసీపీ వాళ్ళని కొట్టారు. అటు వైసీపీ వాళ్ళు…టీడీపీ వాళ్ళని కొట్టారు. ఇలా కుప్పంలో పెద్ద రచ్చ నడిచింది. అయితే ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్ర అని టీడీపీ, కాదు ఇది టీడీపీ చేస్తున్న కుట్ర అని వైసీపీ అంటుంది. కానీ నిజనిజాలు అనేవి కుప్పం ప్రజలకు తెలుసు.

అదే సమయంలో కుప్పంలో బాబుని ఎలాగైనా ఓడిస్తామని వైసీపీ అంటుంది…కానీ పంచాయితీ, పరిషత్ ల్లో గెలిచినంత ఈజీగా కుప్పం అసెంబ్లీలో గెలవడం కష్టం. బాబుని ఓడించడం సులువు కాదు. మరి చూడాలి ఈ సారి కుప్పం రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news