తెలంగాణలో వైయస్ షర్మిల విషయంలో బీజేపీ అధిష్టానం ఇప్పుడు జాగ్రత్తపడే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నుంచి ఎవరైనా వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా అనే దానిపై ఆసక్తి కరంగా చూస్తున్నారు. కొంతమంది ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది ఇంకా స్పష్టత లేదు.
అయితే కొన్ని కొన్ని అంశాల్లో వైయస్ షర్మిల బీజేపీని కూడా గట్టిగానే టార్గెట్ చేయవచ్చు. బిజెపిలో దళిత సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే అంశాన్ని ఆమె ప్రస్తావించే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి దళితులకు అన్యాయం చేస్తుందని కొన్ని పార్టీలు గత కొంతకాలంగా ఆరోపణలు ఎక్కువగా చేస్తున్నాయి. కాబట్టి షర్మిల కూడా తెలంగాణలో ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని బీజేపీ నేతలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. బిజెపి అగ్ర నాయకత్వం కూడా షర్మిల విషయంలో జాగ్రత్తగా ఉండి పార్టీలో నుంచి ఎవరు బయటకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. బిజెపి లో చాలా వరకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని షర్మిల తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉండవచ్చు అని సమాచారం.