కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

-

కాంగ్రెస్‌ పార్టీ, కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, దీని గురుంచి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ వార్ నడుస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఎంపీ హోంమంత్రి తదితరులు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ పై విరుచుకుపడ్డారు. కమల్ నాథ్ హనుమంతుని భక్తిని బీజేపీ నేతలు ప్రశ్నించగా.. ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు చర్యను ఎదుర్కోవాలని కమల్ నాథ్ అన్నారు.

Karnataka Congress manifesto sparks row between Madhya Pradesh CM and Kamal Nath

ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఏ స్థాయికైనా వెళ్తున్నట్లుగా ఉందని బుధవారం కమల్ నాథ్‌కు రాసిన లేఖలో రాశారు. బజరంగ్ దళ్‌ను స్థిరమైన జాతీయవాద సంస్థ అని అక్కడి హోంమంత్రి పేర్కొన్నారు .
‘కమల్‌నాథ్‌కి లేఖ రాశాను. హనుమంతుని భక్తునిగా చెప్పుకుంటూ ఆయన చాలా ట్వీట్లు చూశాను. కాంగ్రెస్ బజరంగ్ దళ్‌ను పిఎఫ్‌ఐతో సమానం చేసింది. కమల్ నాథ్ తన వైఖరిని స్పష్టం చేయాలి. ఇదే కాంగ్రెస్ రామజన్మభూమిని ప్రశ్నిస్తూనే ఉంది’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు భక్తులను, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆయన వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news