BREAKING : A10 ముద్దాయి కింద బొడిగే శోభ అరెస్ట్.. జైలుకు తరలింపు

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఇంటి ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఇంటి ముందు భారీగా చేరుకున్న పోలీసులు.. కాసేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ వాహనంలో కరీంనగర్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బండి సంజయ్ జాగరణ దీక్షలో బోడిగే శోభ A10 ముద్దాయిగా ఉంది.

ఈ నేపథ్యంలోనే.. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆమెను రేపు జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టె ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా గత నాలుగు రోజుల కింద కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ కుమార్.. జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్ష నేపథ్యంలో తెలంగాణ పోలీసులు బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేశారు. కరోనా రూల్స్ కు వ్యతిరేకంగా దీక్షలు చేయరాదనే నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు.