రాజమౌళి కాళ్లు మొక్కిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ సినిమా తీసినా.. చరిత్ర సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి, ఈగ లాంటి సినిమాలు ఆయన… కెరీర్ని మార్చేశాయి. ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి… ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్నారు జక్కన్న. ఇది ఇలా ఉండగా తాజాగా.. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ కు మన జక్కన్న స్పెషల్ గెస్ట్ గా వచ్చేసారు. అయితే ఈ నేపథ్యంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్… టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాళ్లు మొక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక బాలీవుడ్ హీరో.. రాజమౌళి కాళ్ళు మొక్కడం ఏంటి అని అందరూ షాక్ కు గురి అవుతున్నారు. కాగా రణబీర్ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మరియు అమితాబచ్చన్ నటిస్తున్నారు.