ఒత్తిడి లేకుండా హాయిగా ఉండాలంటే ఈ పద్ధతులని ఫాలో అయితే బెస్ట్..!

-

ఇంటి పని, బయట పని కారణంగా చాలా మందిలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి నుంచి దూరంగా ఉండడం కొంచెం కష్టమే. కానీ ఈ విధంగా పాటిస్తే ఒత్తిడి నుంచి దూరంగా ఉండొచ్చు. ఎక్కువ పనులు ఉండడం సరిగ్గా ఎవరితోనూ మాట్లాడకపోవడం కారణంగా వర్క్ లోడ్ ఎక్కువ పడిపోయి.. ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అయితే సులభంగా ఒత్తిడిని తీసిపారేయకండి. దీని వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఒత్తిడిని దూరం చేయడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటికోసం చూసేద్దాం.

 

సరిగ్గా ప్లాన్ చేసుకోవడం:

సమయం వెనకే చాలా మంది అలా పరిగెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది అందుకనే మీ పనులు సమయానికి ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఎక్కువ పనులు పెట్టేసుకుని ఇబ్బంది పడకండి.

ముందురోజు రాత్రి ప్లాన్ చేసుకోవడం:

రేపు ఏం చేయాలి మొదటగా ఏ పనులు పూర్తి చేసుకోవాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. అలా చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది అలాగే పనులు కూడా సక్రమంగా టైంకి అయిపోతాయి.

పెప్పెర్మెంట్ టీ:

పెప్పెర్మెంట్ టీ తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. అలానే డిప్రెషన్, యాంగ్జైటీ మొత్తం అన్నీ కూడా తొలగిపోతాయి కనుక రిలాక్స్ గా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టీ తాగి చూడండి.

నచ్చిన పాటలు వినడం:

పాటలు వినడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుంది. దీనితో మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది మీరు బాగా బిజీగా ఉన్నప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మంచి పాటలు వినండి.

స్నేహితులతో మాట్లాడడం:

మీరు బాగా నమ్మే వ్యక్తి తో మాట్లాడటం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుంది. మీయొక్క బాధల్ని వాళ్ళతో చెబితే మీ బాధ తొలగిపోతుంది లేదా కాసేపు రిలాక్స్ గా పడుకోండి. ఒకసారి నిద్రపోతే కూడా ఒత్తిడి దూరం అవుతుంది ఇలా సులభంగా ఒత్తిడి నుండి దూరం అవ్వచ్చు దీంతో ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news