బాలీవుడ్లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను ఫిల్మ్‌ఫేర్ ఎడిటర్ నేతృత్వంలోని బృందం ప్రకటించింది. ఈ ఏడాది షేర్షా, సర్దార్ ఉద్దమ్, మిమీ సినిమాలు ఎక్కువ అవార్డ్స్ సాధించాయి.
1983లో వరల్డ్ కప్ నేపథ్యంలో వచ్చిన 83 సినిమాలో అద్భుత నటన ప్రదర్శనకుగానూ హీరో రణ్ వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. మిమి మూవీలో ప్రధాన పాత్రలో నటించిన కృతి సనన్ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ గెలుచుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సుభాష్ ఘాయ్ సొంతం చేసుకున్నారు. వీరితో పాటు మరికొందరు స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. ఇక ఇతర విభాగాల్లో అవార్డులు సాధించిన వారి విషయానికొస్తే…
పాపులర్ అవార్డ్స్…
- ఉత్తమ చిత్రం: షేర్షా (ధర్మ ప్రొడక్షన్స్)
- ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా)
- ఉత్తమ నటుడు: కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ (83)
- ఉత్తమ నటి: కృతి సనన్, మిమీ రాథోడ్‌గా మిమీ
- ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమీ)
- ఉత్తమ సహాయ నటి: సాయి తమంకర్ (మిమీ)
- బెస్ట్ డెబ్యూ మేల్ : ఇహాన్ భట్ – జే పాత్రలో 99 సాంగ్స్
- బెస్ట్ డెబ్యూ ఫీమేల్ శార్వరీ వాఘ్ – బంటీ ఔర్ బబ్లీ 2 సోనియా రావత్ / జాస్మిన్ “జాజ్” గా
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : సీమా పహ్వా – రాంప్రసాద్ కి తెహ్ర్వి
సాహిత్యం..
- ఉత్తమ కథ: అభిషేక్ కపూర్, సుప్రతిక్ సేన్ మరియు తుషార్ పరాంజపే (చండీగఢ్ కరే ఆషికి)
- ఉత్తమ స్క్రీన్ ప్లే: శుభేందు భట్టాచార్య మరియు రితేష్ షా (సర్దార్ ఉద్దం)
- ఉత్తమ డైలాగ్: దిబాకర్ బెనర్జీ మరియు వరుణ్ గ్రోవర్ (సందీప్ ఔర్ పింకీ ఫరార్)
సంగీతం
- ఉత్తమ సంగీత దర్శకుడు: తనిష్క్ బాగ్చి, బి ప్రాక్, జానీ, జస్లీన్ రాయల్, జావేద్-మొహ్సిన్ మరియు విక్రమ్ మాంట్రోస్ (షెర్షా)
- ఉత్తమ గీత రచయిత: కౌసర్ మునీర్ – “లెహ్రా దో” (83)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: బి ప్రాక్ – “మన్ భరేయా” (షేర్షా)
- ఉత్తమ నేపథ్య గాయని : అసీస్ కౌర్ – “రాతన్ లంబియా” (షేర్షా)
విమర్శనాత్మక సినిమాలు
- ఉత్తమ చిత్రం (ఉత్తమ దర్శకుడు): షూజిత్ సిర్కార్ (సర్దార్ ఉదమ్)
- ఉత్తమ నటుడు: విక్కీ కౌశల్ – ఉధమ్ సింగ్ పాత్రలో సర్దార్ ఉదమ్
- ఉత్తమ నటి: విద్యాబాలన్ – విద్యా విన్సెంట్ పాత్రలో షెర్నీ
స్పెషల్ అవార్డ్
- ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: సుభాష్ ఘాయ్
టెక్నికల్ అవార్డ్స్
- ఉత్తమ ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్ (షేర్షా)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మాన్సీ ధ్రువ్ మెహతా మరియు డిమిత్రి మలిచ్ (సర్దార్ ఉదమ్)
- ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ – “చక చక్” (అత్రంగి రే)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ (సర్దార్ ఉదమ్)
- ఉత్తమ సౌండ్ డిజైన్: దీపాంకర్ చాకి, నిహార్ రంజన్ సమాల్ (సర్దార్ ఉద్దం)
- ఉత్తమ నేపథ్య సంగీతం: శంతను మోయిత్రా (సర్దార్ ఉద్దమ్)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వీర కపూర్ ఈఈ (సర్దార్ ఉద్దమ్)
- ఉత్తమ యాక్షన్: స్టీఫన్ రిక్టర్, సునీల్ రోడ్రిగ్స్ (షెర్షా)