పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరో బాంబు పేలుడు సంభవించింది. మొదట ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి చేయగా.. 52 మంది మరణించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో వ్యక్తి సూసైడ్ బాంబర్ మారాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 55కు చేరింది. ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మసీదు ప్రాంగణంలో వందలాది మంది ఓ చోట చేరి ప్రార్థనలు చేస్తుండగా.. బాంబు పేలడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు.
ఈ పేలుడులో 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఆత్మాహుతి దాడి మాస్తుంగ్ డీఎస్పీ నవాజ్ గష్కోరీ కారు పక్కనే నిల్చుని ఆ సూయిసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్ అధికారి జావేద్ లేహ్రీ వెల్లడించారు. కాగా, ఘటనా స్థలానికి అదనపు సహాయ బృందాలను పంపిస్తున్నట్లు బలూచిస్తాన్ హోం మంత్రి తెలిపారు. విదేశాల మద్దతుతో బలూచిస్తాన్ లో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.