కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మా పార్టీనే గెలుస్తుంది అంటుంటే… బీజేపీ నాయకులు ఈసారి కూడా మాదే అధికారం అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే దాదాపుగా ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ తెలిపినా వివరాల ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఊహించాయి. అయితే బొమ్మై ఈ సర్వేల ఫలితాలను కొట్టి పారేశారు. రేపు రాబోయే ఫలితాలలో కచ్చితంగా మాదే విజయం అంటూ ధీమాను వ్యక్తం చేశారు. గతంలో లాగా ఈసారి రిసార్ట్ ల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టమైన మెజారిటీ మాకే వస్తుందని నమ్మకంతో ఉన్నారు.
కాగా గతంలో కాంగ్రెస్ జీడీఎస్ లు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని నేలకూల్చి రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.