ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ ఊరురా తిరిగారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెదేపా నిర్వహించిన రా.. కదలిరా సభలో మాట్లాడారు. జగన్ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పారు. అంతులేని అవినీతి జరిగిందని రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు తలకిందులు అయ్యాయి. పన్నుల పేరుతో ప్రజలపై భారం కూడా వేశారని 12 లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చారు. ఆ డబ్బు ఏమైందో చెప్పటం లేదన్నారు.

భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి తెదేపా హయంలో ఇసుక ని ఉచితంగా ఇస్తే వైకాపా నేతలు దోచుకుంటున్నారని అన్నారు. గతంలో మద్యం పాలసీ పారదర్శకంగా ఉండేదని అన్నారు. మద్యం ద్వారానే 60 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని అన్నారు జనసేన నేత పోతిన మహేష్ మాట్లాడుతూ.. వివిధ పన్నుల తో ప్రజల రక్తాన్ని జగన్ జలగల పిలుచుకునే రకం అని అన్నారు
