ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ : చంద్రబాబు

-

వైసీపీ ఎమ్మెల్యేల స్థాన చలనంపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలను పక్కా స్థానాలకు ట్రాన్స్ ఫర్ చేసిన పరిస్థితి ఎక్కడైనా చూశామా..? ఈ నియోజకవర్గంలో చెల్లని కాసు పక్క ప్రాంతంలో చెల్లుతుందా? మనింట్లో చెత్తని పక్కింట్లో వేస్తే బంగారం అవుతుందా ? ఎమ్మెల్యేలను మారిస్తే ఓట్లు వేస్తారని జగన్ అనుకుంటున్నాడు. బెజవాడ వెస్ట్ లో వేస్ట్ అయిన కొబ్బరి చిప్పల మాజీ మంత్రి.. సెంట్రల్ లో బెస్ట్ అవుతాడా అని మండిపడ్డారు.

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ ఉండాలనేది నా ఆకాంక్ష అన్నారు. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుంది. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడింది. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయింది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రా.. కదిలిరా అని పిలుపునిస్తున్నా. అసమర్థుడు ఉంటే రాష్ట్రం కొంత వరకు నష్టపోతుంది. దుర్మార్గుడు పాలిస్తే.. రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ప్రజాస్వామ్యంలో నిద్రలేని కాలరాత్రులు గడిపాం అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news