బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ చోరీ.. రూ.3.82 లక్షల వరకు..!!

-

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ చోరీకి గురైంది. ఏకంగా రూ.3.82 లక్షలు ట్రాన్స్ ఫర్ అయినట్లు బోనీ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అయిదు సార్లు ట్రాన్సాక్షన్ జరిగాయని, ఆయన ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

boney-kapoor
boney-kapoor

అయితే తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు విత్‌డ్రా అయినట్లు బోనీ కపూర్ బ్యాంక్ వద్ద సమాచారం కోరారు. ఆ తర్వాత పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తనను ఎవరూ క్రెడిట్ కార్డ్ అడగలేదని, కనీసం ఎవరి దగ్గరి నుంచి కూడా అనుమానంగా కాల్ రాలేదన్నారు. అయితే బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వాడిన సమయంలో సైబర్ నేరగాళ్లు డేటా చోరీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బోనీ కపూర్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news