మీకు బీరు తాగే అలవాటుందా.. అయితే.. ఓసారి గుండెరాయి చేసుకుని ఈ వార్త వినండి.. ఎందుకు అనుకుంటున్నారా..? సింగపూర్ లో యూరిన్ తో బీర్ చేస్తున్నారంట.! సింగపూర్ అంటే..ధనిక దేశంగా చెప్పుకుంటాం.. కానీ అక్కడ ఇలా మరీ టాయిలెట్ తో బీర్ చేసేందంట్రా బాబు.వృథా అయిపోతున్న యూరిన్ పర్యావరణ హితంగా మార్చేందుకు జరిగిన అద్భుత ప్రయత్నంగా చెప్తున్నారు.
ఈ కొత్తరకం బీర్‌ని “ది గ్రీనెస్ట్ బీర్” అంటున్నారు. దీన్ని యూరిన్, మురుగునీరును ఫిల్టర్ చేసి తయారుచేస్తున్నారు. బీర్ తయారీకి నీరు ఎంతో అవసరం. బీర్‌లో 90 శాతం నీరే ఉంటుంది. ప్రపంచంలో కాఫీ తర్వాత ఎక్కువగా ప్రజలు వాడుతున్నది బీరే. కాబట్టి.. బీర్ తయారీకీ వాటర్ ఎక్కువగా కావాలి.. కానీ.. సింగపూర్ లో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది.. దాంతో మురుగు నీరు నుంచి నీటిని వేరు చేసి… తయారుచేయడం వల్ల ఇది కుదురుతుందని సింగపూర్ మద్యం తయారీ కంపెనీలు చెప్తున్నాయి.
న్యూవాటర్…
ముందుగా… న్యూవాటర్ (NeWater)ని తయారుచేస్తున్నారు. మురుగు నీటిపై రకరకాల పరీక్షలు జరిపి… వరుస రౌండ్లలో ఫిల్టరేషన్ జరిపి…ఆ తర్వాత తాగేందుకు అది సేఫ్ అని ఫిక్స్ అయ్యేలా చేస్తున్నారు. ఆ నీటిని న్యూవాటర్ లేదా అల్ట్రా క్లీన్ వాటర్ అని పిలుస్తున్నారు. ఆ నీటితోనే పిస్ బీర్ తయారుచేస్తున్నారు.
ఏప్రిల్ లో మొదలైన అమ్మకాలు..
ఈ కొత్త మద్యాన్ని ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ వాటర్ ఏజెన్సీ PUB, స్థానిక బ్రూవరీ బ్రూవెర్క్జ్ (Brewerkz), సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ (SIWW) కలిసి… ఈ బీర్‌ని ప్రారంభించాయి. ఈ బీర్‌లో సాధారణ నీరు అస్సలు వాడరు. మొత్తం న్యూవాటర్‌తోనే చేస్తున్నారు. ప్రపంచంలో సాధారణ నీరు వాడకుండా తయారుచేస్తున్న మొదటి బీర్ ఇదేనట. న్యూవాటర్ వల్ల బీర్ రుచిలోగానీ, నాణ్యతలోగానీ ఎలాంటి తేడాలూ ఉండవట. ఈ కొత్త బీర్… టోస్ట్ లాగా, తేనె లాగా ఉందని తాగిన వాళ్లు అంటున్నారు.
మొత్తానికి అలా బీర్ తయారు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకేం వాటితో చేస్తారో..!