కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ PM Kisan Scheme కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన చాల మందికి బెనిఫిట్ గా ఉంటుంది.
మోదీ సర్కార్ రైతుల కోసం ఈ పథకాన్ని తీసుకు రావడం జరిగింది. అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రవేశ పెట్టారు. ఇప్పటికే చాల మంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలని పొందుతున్నారు.
పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తాయి. ఇవి .2 వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతలకు వస్తాయి. ఇలా ప్రతీ ఏడాది డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే భార్య భర్తలు ఇద్దరికీ ఈ డబ్బులు వస్తాయా..? ఈ విషయం గురించి చూస్తే..
ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ పొలం ఉంటుంది. ఇలాంటప్పుడు ఇద్దరికీ పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు వస్తాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఒక కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే వస్తాయి. ఒకరికి మాత్రమే రూ.2 వేల చొప్పున వస్తుంటాయి. ఒకవేళ ఇంట్లో ఇద్దరికీ డబ్బులు వస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ తిరిగి వసూలు చేయడం జరుగుతుంది.