దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి మంచి లాభం కలుగుతుంది. కరోనా మహమ్మారి వలన ఎన్నో ఇబ్బందులు వచ్చాయి.
అందుకే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ కొత్త స్కీమ్ తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ లో కనుక చేరితే అధిక వడ్డీ పొందొచ్చు. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
ఎస్బీఐ ఉయ్ కేర్ డిపాజిట్ ని కరోనా నేపథ్యంలో తీసుకు వచ్చింది. అయితే ఈ స్కీమ్ లో చేరడానికి సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ వడ్డీని పొందవచ్చు.
కనీసం ఐదేళ్ల కాల పరిమితితో డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కేవలం కొంత కాలమే ఉంటుంది అని ఎస్బీఐ చెబుతోంది. సెప్టెంబర్ చివరి వరకు ఈ స్కీమ్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో చేరితే 6.2 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. 60 ఏళ్లకు పైన వయసు పైబడిన వాళ్ళు మాత్రమే దీనిలో చేరడానికి అవకాశం.
ఇది ఇలా ఉంటే ఎస్బీఐ ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్ లో సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 30 బేసిస్ పాయింట్ల వడ్డీ వస్తుంది. ఇది సీనియర్ సిటిజన్స్‌కు అందిస్తున్న 50 బేసిస్ పాయింట్లకు ఇది అదనం. ఒకవేళ కనుక ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్‌లో చేరితే.. అప్పుడు 80 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ పొందొచ్చు.