రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : బొత్స

-

రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లాలా..? లేదా..? అని ఆలోచన చేస్తామని.. అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..? అని ఫైర్ అయ్యారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని.. రాజధాని అభివృద్ది అంశం సమయం, ఖర్చు, నిధులతో ముడిపడి ఉన్నాయని తెలిపారు.

అభివృద్ది విషయంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని.. ప్రస్తుతం సీఆర్డీఎ చట్టం అమల్లో ఉంది.. దీన్ని డీవియేషన్ చేసి ఎలా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాజధానిపై మా విధానం మాకు ఉందని.. అభివృద్ది అనేది వ్యక్తుల కోసం కాదు.. వ్యవస్ఖ కోసం చేయాలని వెల్లడించారు. రాజధానిలో డెవలప్మెంట్ చేస్తున్నాం.. ఎక్కడా డీవియేట్ కావడం లేదని.. అభివృద్ది వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం.. దానికి కట్టుబడి ఉన్నామన్నారు.

రైతులకు చేయాల్సినవన్నీ చేస్తున్నాం.. రైతులకు సీఎం ఎందుకు క్షమాపణ చెప్పాలని.. మేము ఎక్కడా రాజధాని భూములను ఇతర అవసరాల కోసం ఎక్కడా తనాఖా పెట్టలేదని స్పస్టం చేశారు. రాజధాని అభివృద్ది కోసమే రాజధాని లోని భూములను హడ్కోకు తాకట్టు అని.. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనాఖా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో అనేది మీరే చూస్తారని.. రాజధానిపై చట్ట పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news