‘బ్రహ్మస్త్రం’ మూవీ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో నాగార్జున!

-

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్-అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బహ్మస్త్ర’. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. హీరోగా నాగార్జున. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కానుంది.

హీరో నాగార్జున
హీరో నాగార్జున

ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ప్రకటించింది. సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలే పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో నాగార్జున ఇంటెన్సీవ్ లుక్స్ తో.. చేతిలో అద్భుతమైన పవర్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున పేరు అజయ్ విశిష్ట్‌ గా పేర్కొన్నారు. నాగార్జున పాత్రపై చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో పలు అంశాలను వెల్లడించింది. ‘సహస్ర నందిమ్ సామర్థ్యం.. హే నంది అస్త్రం.. ఖండ ఖండ ఖురు, మామ్ సహాయకం’ వెయ్యి నందులతో కూడా నంది అస్త్రం అంటూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. మైథలాజికల్ అడ్వంచరస్ డ్రామాగా ఈ సినిమాను మూడు భాగాల్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news