Big Breaking : యాదాద్రిలో రూ.300 టికెట్‌తో బ్రేక్‌ దర్శనం..

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయాన్ని పునఃనిర్మించిన విషయం తెలిసిందే. అయితే.. గత కొన్ని నెలల క్రితమే యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభించారు. అయితే.. తాజాగా.. యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 31 నుండి వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనాల సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీ భక్తులకు అలాగే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఈవో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Photos: This temple is Telangana's reply to Andhra's Tirumala | The Times  of India

ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయని వివరించారు. బ్రేక్ దర్శన సమయంలో ఉచిత దర్శనం, ఇతర టికెట్ దర్శనాలు నిలిపివేస్తామన్నారు. బ్రేక్ దర్శనాల సందర్భంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ఈవో ఎన్.గీత చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news