విపరీతమైన వెన్నునొప్పికి ఈ చిట్కాలు ట్రే చేయండి..!

-

తలనొప్పి, వెన్నునొప్పి సైనికులు లేకుండా యుద్ధం చేయడం లాంటింది. ఆ బాధ, ఆ ప్రభావం ఎవరికీ కనిపించదు.. భరించేవాడికి మాత్రమే తెలుస్తుంది. తిన్నగా కుర్చోలేం, పడుకోలేం.. ప్రశాంతంగా నిద్రకూడా రాదు. నొప్పి ఒక్కటే అయినా కారణాలు మాత్రం వేరు ఉంటాయి.. వెన్ను నొప్పి తీవ్రమైతే.. వైద్యులను ఆశ్రయించక తప్పదు. అయితే, ప్రతీసారి వైద్యులను ఆశ్రయించాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అనేక చిట్కాలున్నాయి… వ్యాయామాలు, యోగా భంగిమలు ట్రై చేయడం ద్వారా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని వెన్నునొప్పి నివారణ చిట్కాల గురించి ఈరోజు చూద్దాం.

మసాజ్..

నొప్పి ఉన్న చోట మసాజ్ చేస్తే సూపర్‌గా ఉంటుంది. అసలు ఆ నొప్పికి కరెక్ట్‌గా మసాజ్ చేయించుకుంటంటే.. స్వర్గం లెక్కే అనిపిస్తుంది. మసాజ్ చేయడం వలన తక్షణమే రిలాక్స్ అవుతారు. వెన్ను నొప్పి నివారణకు అనేక రకాలుగా మసాజ్ చేయొచ్చు. ఇందుకోసం మసాజ్ ఆయిల్‌ను గానీ, ఆలీవ్ ఆయిల్ గానీ, కొబ్బరి నూనె గానీ కొద్దిగా వేడిచేసి అందులో కర్పూరం వేసి చేయించుకోండి.

చెప్పులు, షూస్‌..

ఒక్కోసారి మనం వాడే పాదరక్షలు కూడా వెన్ను నొప్పికి కారణం అవుతాయి. అందుకే సౌకర్యవంతంగా ఉండే బూట్లు, చెప్పులను మాత్రమే వినియోగించాలి.

స్ట్రెచింగ్..

కండరాలు, స్నాయువులను సాగదీయడం(స్ట్రెచింగ్) ద్వారా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వెన్ను నొప్పి నుంచి రిలాక్స్ అవడానికి ఇది మంచి టిప్‌. స్ట్రెచింగ్ ద్వారా కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. నేల వైపు వంగి కాలి వేళ్లను తాకడం, రకరకాల భంగిమలతో స్ట్రెచింగ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

వేడి పదార్థం, ఐస్ క్యూబ్స్..

వెన్ను నొప్పికి కాపడం పెట్టడం, ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వలన వెన్ను నొప్పి తక్షణ ఉపశమనం పొందుతారు.. ప్రభావిత ప్రాంతంలో ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయొచ్చు. లేదా వేడి నీటిలో క్లాత్ ముంచి మర్ధన చేయాలి. తద్వారా కండరాలు విశ్రాంతి పొందుతాయి. నొప్పిని తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news