బ్రేకింగ్; 50 మంది డాక్టర్లు మృతి…!

-

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం అయిపోతుంది. ప్రతీ ఒక్కరు కూడా కరోనా వైరస్ దెబ్బకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడింది. ఇక వైద్యుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైద్యులు అందరూ కూడా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. అన్ని దేశాల్లో కూడా వైద్యులు ఇప్పుడు ప్రజల కోసం తమ కుటుంబాలను కూడా లెక్క చేయడం లేదు.

ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు. అక్కడి వైద్యులు అయితే అన్నం తినాలి అన్నా సరే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటలీలో మొత్తం లక్ష మంది బాధితులు ఉన్నారు. పది వేల మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా ఇప్పుడు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇప్పటి వరకు అక్కడ 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయారని… నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. లాంబార్డీ అనే ప్రాంతంలో కరోనా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రాంతంలోనే 17 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు కరోనాపై ఎలాంటి రక్షణ లేకుండానే వైద్యం చేయడానికి సిద్దపడ్డారని… ఇటలీ వ్యాప్తంగా 7,100 మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news